5వ వార్డు ను పట్టణంలో ఆదర్శంగా నిలుపుతా..

5వ వార్డు ను పట్టణంలో ఆదర్శంగా నిలుపుతా..

ధర్మపురి, (ఆంధ్రప్రభ): మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని 5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి వేముల నాగలక్ష్మి ఓటర్ లను కోరారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ప్రాతినిధ్యం వహించిన 7వ వార్డు లో ఎ వార్డు లో లేని అభివృద్ధి చేసామని ఇప్పుడు 5వ వార్డు ను పట్టణంలో ఆదర్శంగా నిలిపి ఉత్తమ వార్డు గా అభివృద్ధి చేస్తామని వేముల నాగలక్ష్మి హామి ఇచ్చారు. తాను గెలిపిస్తే వార్డు అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించారు.ధర్మపురి మున్సిపల్ లో అదివారం 5వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమన్నారు. ఐదవ వార్డు ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ వార్డును మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారం తో అత్యధిక నిధులు తీసుకువచ్చి ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని పేర్కొన్నారు. వార్డు సమస్యలపై పరిష్కారం చేసి నిధులు సాధించాలంటే విద్యావంతురాలైన తాను కౌన్సిల్ లో ఉండాలని ప్రజలను కోరారు. ఐదవ వార్డు ప్రజలు భారీ ఎత్తున మద్దతు తెలుపుతూ ఘన స్వాగతం పలికారు.దాదాపు నాగలక్ష్మి గెలుపు ఖాయం అయ్యింది అన్ని వర్గాలు మద్దతు గా నిలుస్తున్నారు.

Leave a Reply