అరుణోదయ నాగన్న సంతాప సభను జయప్రదం చేయండి
గూడూరు, ఆంధ్రప్రభ: అరుణోదయ నాగన్న సంతాప సభను జయప్రదం చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాక్య జిల్లా అధ్యక్షులు శ్రీశైలం పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో నాగన్న సంతాప సభ వాల్ పోస్టర్ లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ.. 50 వసంతాలుగా విప్లవ సాంస్కృతిక కళా రంగమైన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో పీడిత,తాడిత ప్రజల కోసం పాటతో పోరాటాన్ని కొనసాగించాడని తెలిపారు.
గోదావరి లోయ ప్రతిఘటన పోరాటంలో అమరులైన విప్లవ వీరుల స్మృతి గీతాలను నాగన్న గానం చేసి అశేష ప్రజానీకాన్ని చైతన్యపరిచిన గొప్ప గాయకుడు కామ్రేడ్ అరుణోదయ నాగన్న అని కొనియాడారు. ఈనెల 25న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంతాప సభ నిర్వహించడం జరుగుతుందని, కావున ప్రజాస్వామికవాదులు, ప్రజలు, కళాభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి గజ్జి లింగన్న, పెనుక భరత్, వజ్జయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
