అభివృద్ధి చేస్తా ..ఆదరించి గెలిపించండి.

అభివృద్ధి చేస్తా ..ఆదరించి గెలిపించండి.

మంత్రి సీతక్క కృషితో నిధులు తీసుకొస్తా.
20వ వార్డును అభివృద్ధి చేయడమే నా లక్ష్యం.
కాంగ్రెస్ అభ్యర్థి హాట్కర్ ప్రశాంత్ నాయక్

ములుగు ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రంలోని ములుగు మున్సిపాలిటీకి చెందిన 20వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి హాట్కర్ ప్రశాంత్ నాయక్ ప్రజలకు కీలక హామీలు ఇచ్చారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి తగిన విధంగా పనిచేసి 20వ వార్డును అభివృద్ధిలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే నా లక్ష్యమని వారు స్పష్టం చేశారు.ఎన్నికల నేపథ్యంలో వార్డులో ప్రచారం వేగంగా కొనసాగుతున్న సమయంలో హాట్కర్ ప్రశాంత్ నాయక్ మాట్లాడుతూ ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే వారి రుణం తీర్చుకోవడం నా బాధ్యత అని తెలిపారు. అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ ఉండదు” అని ధీమాగా ప్రకటించారు.మంత్రి సీతక్క కృషితో నిధులు తీసుకొచ్చి 20 వ వార్డును అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.తాను యువకుడిననీ ,చురుగ్గా పని చేస్తానని తెలిపారు.ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, వార్డులో ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.వార్డులో కీలక సమస్యలపై ఫోకస్ పెట్టిన ప్రశాంత్ నాయక్ పరిశుభ్రత,తాగునీరు,రోడ్లు,డ్రైనేజీ,మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.అలాగే ప్రజల సహకారంతో 20వ వార్డును మున్సిపాలిటీలోనే ఆదర్శ వార్డుగా నిలబెడతానని ప్రజలకు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.

Leave a Reply