బీజేపీకి పట్టం కట్టండి..అభివృద్ధి చేస్తా..
బీజేపీకి పట్టం కట్టండి..అభివృద్ధి చేస్తా..
- 17వ వార్డు బీజేపీ అభ్యర్థి గుజ్జారి శ్రీనివాస్
కల్వకుర్తి, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ ఎన్నికల్లో తనను ఓటర్లు ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని 17వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి గుజ్జరి శ్రీనివాస్ ఓటర్లను కోరారు. ఎన్నికల్లో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి వార్డులో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూన్నారు. ప్రతిరోజు గడప గడపకు తిరుగుతూ ఓటర్లను కలుస్తూ మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుపై వేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. నా బలం బలగం వార్డు ప్రజలేనని పేర్కొంటున్నారు.
కౌన్సిలర్ గా గెలిస్తే వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ఆదర్శంగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యిందంటూ ప్రచారంలో వాటిని ఆస్త్రాలుగా మలుచుకుంటూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తనదైన శైలిలో గుజ్జరి శ్రీనివాస్ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని గుజ్జారి శ్రీనివాస్ ఓటర్లను కోరారు.
