Nagarkurnool | ఆ.. కుటుంబాలకు చేయూత..

Nagarkurnool | ఆ.. కుటుంబాలకు చేయూత..
Nagarkurnool, వెల్దండ, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని చెదురుపల్లి గ్రామానికి చెందిన పోలే అంజయ్య, పోలే మైసయ్య, ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. వారి మృతి పట్ల సర్పంచ్ ధన్ సింగ్ నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం సింగిల్ విండో మాజీ చైర్మన్ జూపల్లి భాస్కరరావు ఇరువురికి 10 వేల చొప్పున 20 వేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోలే అశోక్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
