Flash news | ఎన్ హెచ్ 163 వరంగల్ జాతీయ రహదారి మూసివేత..

Flash news | ఎన్ హెచ్ 163 వరంగల్ జాతీయ రహదారి మూసివేత..
Flash news, మేడిపల్లి, ఆంధ్రప్రభ : ఉప్పల్ వైపు వెళ్ళే వాహన దారులకు ఘట్కేసర్ ట్రాఫిక్ పోలీసుల ముఖ్య సూచన చేశారు. పీర్జాదిగూడ కమాన్ వద్ద పిల్లర్ ఫౌండేషన్ కన్స్ట్రక్షన్ పని జరుగుతున్నందు వలన ఉప్పల్ వైపు వెళ్ళే వాహన దారులు డెకత్లాన్ వద్ద ఎడమ వైపుకి వెళ్లి, అక్కడి నుండి సేక్రేడ్ హార్ట్ స్కూల్ ముందు నుండి పీర్జాదిగూడ మెయిన్ రోడ్ వద్ద కుడి వైపుకి తీసుకొని అక్కడి నుండి ఉప్పల్ వైపు వెళ్ళగలరు.
ఈ డైవర్షన్ 07.02.2026 నుండి 26.02.2026 వరకు అమలులో ఉండును. వాహన దారులు ఈ విషయాన్ని గమనించగలరు. పోలీస్ వారికి సహకరించగలరు. Traffic Advisory given by Sri V.Srinivas, DCP, Traffic-II, Malkajgiri Commissionerate.
