ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా

నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : ఈనెల 11న జరుగనున్న మున్సిపల్ ఎన్నిక ల్లో ఒక్కసారి 38వ వార్డు కౌన్సిలర్ గా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాందేడపు అన్నపూర్ణ చిన్ను ఓటర్లను అభ్యర్థించారు. శుక్రవారం బుధవార్ పేట్ లో ఇంటింటా ప్రచారం చేశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ చిన్ను మాట్లాడుతూ. తనకు ఒక్కసారి కౌన్సిలర్ గా అవకాశం కల్పిస్తే కాలనీ అభివృద్ధి చేసి చూపిస్తానని ఆ హామీనీచ్చారు..
38వ వార్డు లో నెలకొన్న సమస్యలన్నింటిని మూడు నెల ల్లోనే తెలుసుకుని దశల వారిగా సమస్యలను పరిష్కరించి మీముందుకు వస్తామని ఓటర్లకు భరోసా కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, వార్డుకు ప్రత్యేకంగా నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పెద్దల సహకారంతో కాలనీ అభివృద్ధి కొరకుప్రత్యేక నిధులు తీసుకువచ్చి దోహదపడుతామన్నారు. వార్డులో నెలకొన్న సమస్య లు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని వెనువెంటనే పరిష్కరించేందుకు పెద్దల సహకారంతో పరిష్కరిస్తామన్నారు. వార్డు ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టారు. ఆయన వెంట కాలనీవాసులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
