మద్దతుగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుల ప్రచారం

మద్దతుగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుల ప్రచారం

  • 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి మానస హన్మంతు

మక్తల్ , ఆంధ్రప్రభ ; మున్సిపల్ ఎన్నికల్లో మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా మీ బిడ్డ వాకిటి మానస హన్మంతును భారీ మెజారిటీతో గెలిపించి మంత్రి వాకిటి శ్రీహరికి కానుక ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్వ శివంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం 14వ వార్డు పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇంటింటి ప్రచారం చేపట్టారు .ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు.

మరింత అభివృద్ధి కోసం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మున్సిపాలిటీలో అధికారాన్ని అప్పగించాలని ఆయన పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి కూడా మీ ఇంటి బిడ్డ అలాంటి వ్యక్తికి మున్సిపాలిటీనీ కానుకగా ఇచ్చే బాధ్యత మక్తల్ ప్రజలపై ఉందని గుర్తు చేశారు. ఒక్కసారి ఆలోచించండి గతంలో అధికారం చేపట్టిన వారు ఏమేరకు అభివృద్ధి చేశారో చేయలేదో ఆలోచించండి .ఇంకెన్నాళ్లు పట్టణం ఇదేవిధంగా ఉండాలి అభివృద్ధి అవసరం లేదా? ఆలోచించాలి అభివృద్ధి కావాలనుకుంటే ఈ ఎన్నికల్లో కచ్చితంగా 14వ వార్డు నుండి పోటీ చేస్తున్న వాకిటి మానస హన్మంతును భారీ మెజారిటీతో గెలిపించి మునిసిపాలిటీని కైవసం చేసుకునేందుకు ఈ ప్రాంత ప్రజలంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే మంత్రి సహకారంతో మక్తల్ పట్టణంలో వందల కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం జరుగుతోందని గుర్తు చేశారు .మరింత అభివృద్ధి కోసం పట్టణ ప్రజలంతా కాంగ్రెస్కు మంత్రికి అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వాకిటి శ్యామ్, బి. రమేష్, వాకిటి కిష్టప్ప, డి .రమేష్ ,రాజు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్, నాగు, నాగరాజ్ ,ఏఎంసి డైరెక్టర్ అంజి,గోవర్థన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply