ఆదరించండి అనుభవంతో వార్డు అభివృద్ది చేస్తా

చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు మున్సిపాల్టీ 10 వార్డులో నిత్యం అందుబాటులో వార్డు సమస్యలను ఎప్పటికి అ ప్పుడు పరిష్కరిస్తూ ప్రజా సేవచేసేందుకు మీ ఆడబిడ్డగా మీ ముందుకు 10 వ వార్డునుంచి బిజెపి అభ్యర్థి గా పోటీ చేస్తున్న వార్డు ప్రజలు కమలం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని గర్రెపల్లి శాంతరాణి వెంకట నర్సయ్య లు కోరుతున్నారు. గత అయిదు సంవత్సరాల 18వ వార్డులో కౌన్సిలర్ గా పనిచె సిన అనుభవంతో 10వ వార్డు అభివృద్ది పథంలో నడిపిస్తానని, అవినీతి ఆస్కారం లేకుండా ఎవ్వరిని ఒక్కరూపాయి ఆశించకుండా వార్డు ప్రజలతో మమేకమై కష్ట సుఖలో పాలుపంచుకొని అభివృద్ధి దిశగా సేవ చేస్తానని, ముఖ్యంగా ప్రధాన సమస్యలైన కోతులు, విధికుక్కల నివారణకై మొదటి తీర్మాణాన్ని పెడుతనని హామీ ఇస్తున్నాను.
