ఆదరించండి అభివృద్ధి చేస్తా…

ఆదరించండి అభివృద్ధి చేస్తా…

  • 30వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఆరుట్ల రామనరసింహారెడ్డి

జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని వార్డు అభివృద్ధి మరింత ముందుకు పోవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మరింత వార్డ్ అభివృద్ధి చేసి చూపెడతారని 30వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆరుట్ల రామ్ నర్సింహారెడ్డి అన్నారు. గురువారం జనగామ ధర్మకంచలోని 30 వార్డులో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ప్రచార నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి ఆరుట్ల రామ్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఈ మున్సిపల్ ఎన్నికల్లో వార్డ్ మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీను, నర్సింగరావు, గొలుసుల దుర్గేష్, కళ్యాణం చంద్రమౌళి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply