యువతకు అవకాశం ఇవ్వండి

యువతకు అవకాశం ఇవ్వండి

  • 20వ‌ వార్డ్ టీఆర్ఎస్ అభ్యర్థి పిన్న మౌనిగోపాల్

షాద్ నగర్, ఆంధ్రప్రభ : యువతకు అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా.. అని 20వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పిన్నమౌనిగోపాల్ ఇంటింటి ప్రచారంలో ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. నేను మీ వాన్ని.. మీరు ఫిలిస్తే పలుకుతా.. ఎప్పుడు పిలిచినా మీ ముందు నిలబడతా.. అంటూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. 20వ వార్డును అభివృద్ధి చేస్తానని అన్నారు. మీకు ఎల్లప్పుడూ సేవలందిస్తూ మీలోనే ఉంటాను.. మీ వాడిని.. నన్ను ఆదరించండి.. అభిమానించి కారు గుర్తుకు ఓటేసి 20వ వార్డు కౌన్సిలర్ గా త‌న‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాల‌ని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply