IconStar | బన్నీ–అట్లీ సినిమాలో మృణాల్.. నిజం చెప్పేసిన హీరోయిన్!
IconStar | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాపై మృణాల్ ఠాగూర్ క్లారిటీ
IconStar | బన్నీ–అట్లీ మూవీపై వైరల్ అవుతున్న ప్రచారం
ఇంటర్వ్యూలో అసలు నిజం చెప్పిన మృణాల్
బన్నీ సినిమాలో ఛాన్స్ ఉందా..?
సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన మృణాల్ కామెంట్స్
IconStar | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ ఇద్దరి కాంబోలో భారీ పాన్ వరల్డ్ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. అయితే.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటిస్తుందని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు కానీ.. మరో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ నటిస్తున్నట్టుగా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో మృణాల్ ని దీని గురించి అడిగితే అసలు విషయం బయటపెట్టింది. దీంతో మృణాల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకీ.. బన్నీతో సినిమా గురించి మృణాల్ ఏం చెప్పింది..?

మృణాల్ ఠాగూర్.. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే.. అందం, అభినయంతో ఆకట్టుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత నటించిన హాయ్ నాన్న సినిమా కూడా సక్సెస్ అవ్వడంతో మరింత క్రేజ్ పెరిగింది. అయితే.. ఫ్యామిలీ స్టార్ మూవీ ఫ్లాప్ అవ్వడంతో అమ్మడుకు తెలుగులో అవకాశాలు కాస్త తగ్గాయని చెప్పచ్చు. అడివి శేష్ తో కలిసి డెకాయిట్ మూవీలో నటించింది. ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. నిత్యం వార్తల్లో ఉంటూ.. ఈమధ్య కాలంలో బాగా ఫేమస్ అయ్యింది.
ఇక అసలు విషయానికి వస్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రూపొందుతోన్న మూవీ మృణాల్ నటిస్తుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండడంతో మంచి ముహుర్తం చూసి మృణాల్ ఈ మూవీలో నటిస్తున్నట్టుగా అపిషియల్ గా అనౌన్స్ చేస్తారని అనుకుంటున్నారు సినీ జనాలు. అయితే.. ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో మృణాల్ ను అల్లు అర్జున్ తో మూవీ గురించి అడిగితే.. ఈ ప్రశ్నకు మృణాల్ సర్ ఫ్రైజ్ ఫీలైంది. నేను అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నానా? అందరూ ఇలా అనుకుంటున్నారా…? ఇది నిజంగా జరగాలని ప్రార్థించండి. అదే జరిగితే.. మరో ఇంటర్ వ్యూలో ఆ సినిమా గురించి మాట్లాకుందాం అని చెప్పింది. దీనిని బట్టి బన్నీ, అట్లీ మూవీలో నటించడం లేదనే విషయాన్ని ఇన్ డైరెక్టర్ గా చెప్పేసింది. అయితే.. ఈ మూవీలో బన్నీ మూడు క్యారెక్టర్స్ లో కనిపిస్తాడని.. కొత్త ప్రపంచాన్ని చూపిస్తారని అంటున్నారు. అందుచేత మరో హీరోయిన్ కి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. మరి.. మృణాల్ కాకపోతే.. ఇంకెర్ని తీసుకుంటారో చూడాలి.
