ప్రతి ఇంటికి ప్రజా సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి, 46వ డివిజన్ అభివృద్ధికి నాంది కావాలి మీ ఆయుధం లాంటి ఓటు

46వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెంట రజిత
మంచిర్యాల ఫిబ్రవరి 4(ఆంధ్రప్రభ) ప్రతి ఇంటికి ప్రజా సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తానని మంచి మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పెంట రజిత రమేష్ అన్నారు.బుధవారం తన కుటుంబ సభ్యులు,పార్టీ నాయకులు,మహిళ కార్యకర్తలతో ప్రచారంలో పెంట రజిత మాట్లాడుతూ పేద బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలను అమలు చేస్తుందని. మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కొరకు మన ప్రేమ్ సాగర్ అన్న ఎమ్మెల్యేగా గెలుపొందిన రెండేళ్లలో పదేళ్లలో జరిగిన అభివృద్ధి పనులను చేసేందుకు పూనుకొని ముందుకు సాగుతుండగా మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అమ్మ ప్రతి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అని నినాదంతో సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అంది విధంగా ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యతీస్తూ ముందుకు సాగుతున్నారని.మరో మూడు సంవత్సరాలు ప్రజా ప్రభుత్వంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ గా నిలిచేందుకు జరుగుతున్న పనులే నిదర్శనం అన్నారు.46 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ ప్రచారంలో 46వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కొండ పద్మ చంద్రశేఖర్. మాజీ కౌన్సిలర్లు దోమల రమేష్, గాదాసు బాపు,తిరుపతి,సురేష్, యువజన నాయకుడు కార్తీక్, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.
