AP | క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి..

AP | క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి..

AP | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధి పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఇది దేశ వ్యాప్తంగా అత్యంత వేగంగా పెరుగుతున్న జబ్బుగా మారిందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం నగరంలో మెడికల్ విద్యార్థులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నివారించే అవకాశం ఉందని తెలిపారు. ఆధునిక వైద్య సాంకేతికత అందుబాటులోకి రావడంతో క్యాన్సర్ చికిత్స మరింత సులభమైందన్నారు. కృష్ణా జిల్లాలో క్యాన్సర్ నిర్ధారణ కోసం భరత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వారి సౌజన్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక బస్సుల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటి వరకు 2,000 మందికి పరీక్షలు నిర్వహించగా, 110 మందిలో క్యాన్సర్ లక్షణాలు గుర్తించామని, వారిలో 28 మంది పూర్తి స్థాయిలో క్యాన్సర్ బారిన పడినట్లు నిర్ధారించామని తెలిపారు. ప్రజలందరూ క్యాన్సర్‌ పై అవగాహన పెంచుకోవాలనే లక్ష్యంతోనే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆశాలత, మెడికల్ కాలేజీ వైద్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply