AP | యాకమూరులో అగ్ని ప్రమాదం..

AP | యాకమూరులో అగ్ని ప్రమాదం..

AP | తోట్లవల్లూరు, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం పరిధిలో యాకమూరు గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి పశువులు చావిడికి గుర్తు తెలియని దండగలు నిప్పు పెట్టారు. వ్యవసాయదారుడుగా మహమ్మద్ అజ్మతుల్లా జీవనం కొనసాగిస్తున్నారు. మంటల్లో అజ్మతుల్లా కళ్ళ ముందే నాలుగు గేదెలు, 8 గొర్రెలు సజీవ దహనం అయ్యాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంటల తీవ్రతతో మరో ఆరు గేదెలు గాయపడినట్లు అజ్మతుల్లా తెలిపారు. మంటల్లో ఉన్న మూగజీవాలను కాపాడే ప్రయత్నంలో యజమాని మహమ్మద్ అజ్మతుల్లాకు గాయాలయ్యాయి. సుమారుగా రూ.10 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలుపుతున్నారు. కావాలనే చావిడికి నిప్పు పెట్టారని, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నాడు.

AP