ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమం
శావల్యాపురం, ఆంధ్రప్రభ : భారతీయ సామాజిక సేవా సంస్థ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆరు ఉత్సవాల్లో ప్రధానమైన గురుపూజోత్సవ కార్యక్రమాన్ని సోమవారం శావల్యాపురం మండలంలోని వేల్పూరు శివాలయంలో ఘనంగా నిర్వహించారు.
మండల బీజేపీ అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పరమ పవిత్రమైన కాషాయ ధ్వజానికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ సంప్రదాయం ప్రకారం గురుపూజ నిర్వహించి సంఘ భావజాలం, సేవా కార్యక్రమాల ప్రాధాన్యాన్ని వివరించారు.
అదేవిధంగా గుర్రంవారిపాలెం గ్రామంలో కూడా గురుపూజోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వినుకొండ సంపర్క్ ప్రముఖ్ దేవతి నరసింహారావు, పల్నాడు జిల్లా ఘోష్ ప్రముఖ్ కొప్పురావూరి కోటేశ్వరరావు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
