MLA | బీ ఫామ్‌ల అందజేత..

MLA | భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థులకు బి ఫామ్ లను ఈ రోజు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. పార్టీ అభ్యర్థులను సర్వేల ఆధారంగా ఎంపిక చేశారు. అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. ఒకటో వార్డు కౌన్సిలర్ గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శెవ్వ అశోక్, రెండోవార్డు కౌన్సిలర్ అభ్యర్థి చింతలూరి పద్మ, మూడో వార్డు అభ్యర్థి, మూత లింబాద్రి, నాలుగో వార్డ్ అభ్యర్థి గున్నాల బాల లక్ష్మి, ఐదో వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి బొదిరే లావణ్య, ఆరో వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి నీలం లావణ్య, ఏడో వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి అస్లాం, ఎనిమిదో వార్డ్ అభ్యర్థి పర్స నవీన్, 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నీలం రవి, పదో వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి, చింతలూరి వాణి, 11 వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా రాజు నాయక్, 12 వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి మల్లెల అనుపమ లను ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు బీఫారం లను ఎమ్మెల్యే అందజేశారు.
