President | మండల అధ్యక్షునిగా సుర్వి మల్లేష్ గౌడ్

President | మండల అధ్యక్షునిగా సుర్వి మల్లేష్ గౌడ్
President | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని మెజారిటీ సర్పంచులు సోమవారం సమావేశమై సర్పంచ్ ల ఫోరం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం మండల కమిటీ అధ్యక్షునిగా సుర్వి మల్లేష్ గౌడ్ (అంకిరెడ్డి గూడెం), ఉపాధ్యక్షులు గా కాకి శ్రీలత (పంతంగి), టేకుల మంజుల (అల్లాపురం), ప్రధాన కార్యదర్శిగా తంగెళ్ల వెంకటేశం, కోశాధికారిగా కైరంకొండ స్వప్న, సహాయ కార్యదర్శిలుగా అన్యాలపు నరేష్, గుండబోయిన శిరీష లను ఎన్నుకున్నారు.
ఈ సమావేశంలో నూతన కమిటీతో పాటు సర్పంచులు గిర్కటి నిరంజన్ గౌడ్ (మల్కాపురం), బక్కతట్ల రాధిక (తూఫ్రాన్ పేట), ఎల్మ రామలింగేశ్వర్ రెడ్డి (కైతాపురం), సమ్మిరెడ్డి భారతమ్మ (జై కేసారం), నందగిరి వెంకటేశం గౌడ్ (గుండ్ల బావి), బోయ మహేంద్రమణి (కాట్రేవు) తదితర సర్పంచులు పాల్గొన్నారు.
