TG | మున్సిపల్ ఎన్నికల్లో మాదే విజయం – బండి సంజయ్

TG | మున్సిపల్ ఎన్నికల్లో మాదే విజయం – బండి సంజయ్
TG | కరీంనగర్ టౌన్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలియజేశారు. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాశక్తి ఆలయంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార వాహనాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడుతుందన్నారు. ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్లకు ఓటు వేసే పరిస్థితి లేదని, బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని, ప్రభుత్వం పై ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారన్నారు.
