Bee form | బీజేపీ జండా ఎగురవేయడం టార్గెట్

Bee form | బీజేపీ జండా ఎగురవేయడం టార్గెట్

Bee form | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ మున్సిపల్ పై బీజేపీ జండా ఎగురవేయడం లక్ష్యంగా అభ్యర్థులు దూసుకు పోవాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి సూచించారు. ఆదివారం భీంగల్ లోని ఎల్జే ఫంక్షన్ హాల్ లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులకు బీ ఫారంలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన అభ్యర్థులకు మనోదైర్యం నింపారు. ఎలాంటి భయాలకు లొంగకుండా ఎన్నికల్లో దూసుకు పోవాలని సూచించారు.

కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, నరేంద్ర మోడీ పాలన పై ఇంటింటికీ ప్రచారం చేయాలన్నారు. బీజేపీ స్టేట్ కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అంటే నమ్మకం అన్నారు. అవినీతి రహిత పాలన కొరకు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ ఎక్కువ సంఖ్యలో కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకుని మాజీ ఎంపీపీ కొండ గోదావరి ని మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు.

అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రచారంలో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి పై ప్రచారం చేయాలని సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొంగలకు బుద్ది చెప్పాలని, బీజేపీని గెలిపించాలని కోరారు. ఈ సమావేశం లో మున్సిపల్ ఇంచార్జి పూస రాజు, జిల్లా ప్రభారి కాంతరావు, సంగెపు అనిల్, నోముల నర్సారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కనికరం మధు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply