YSRCP | దుర్మార్గమైన చర్య..

YSRCP | దుర్మార్గమైన చర్య..

YSRCP | హిందూపురం, ఆంధ్రప్రభ : వైసీపీ సీనియర్ నాయకులు మాజీమంత్రి అంబటి రాంబాబు పై టీడీపీ గుండాలు దాడి చేయడం చాలా దుర్మార్గమైన చర్యని చంద్రబాబు పొలంలో రాష్ట్రం రావణకాష్టల మండిపోతుందని ఏకంగా టీడీపీ గుండాలు కట్టెలు పెట్టుకొని దాడి చేయడం ఆప్రజాస్వామ్యమని వైయస్ఆర్సీపీ బీసీ నియోజకవర్గ నేత మానంపల్లి రామాంజనేయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… అంబటి రాంబాబు మాటల్లో ఏమాత్రం తప్పులేదు అన్నారు. ఆయన దేవాలయానికి వెళ్లి వస్తున్న తరుణంలో టిడిపి గుండాలు ఒక్కసారిగా దాడి చేసి ఆయన వాహనాన్ని అడ్డుకోవడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడుతూ ఆయన మీద దాడి చేయడంతో ఆయన నోరు జారీ మాట్లాడడం జరిగిందన్నారు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా కూడా అలాగే మాట్లాడతారన్న విషయాన్ని తెలిపారు.

మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాకు పార్టీలో క్రమశిక్షణ నేర్పించాడన్నారు. దీంతో పాటు ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో హిందూపురంలో మా బిసి నాయకురాలు దీపికమ్మ నివాసానికి రాత్రి ఒంటిగంటకు చేరుకొని పోలీసులు నోటీసులు ఇవ్వడం ఏంటని సమయం ఒంటిగంట సమయంలో ఎవరైనా నోటీసులు ఇస్తారా? అని విమర్శించారు. ఇక పోలీసులు ఏ విధంగా కూటమి ప్రభుత్వానికి బానిసలుగా బతుకుతున్నారన్నారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.పోలీసుల తీరు మార్చుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారన్నారు. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఏకంగా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నారు. అంబటి రాంబాబు ఎవరికి భయపడే వ్యక్తి కాదన్న విషయాన్ని ఆయన తెలిపారు. వెంటనే చంద్రబాబు నాయుడు పరిపాలనలో తీరు మార్చుకోవాలని 2029 ఎన్నికల్లో జగన్ సీఎం అయితే పరిస్థితి తారుమారుగా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. తాము బీసీలంతా ఏకతాటిగా ముందుకు వచ్చి చంద్రబాబు తీరుపై ఆందోళన చేస్తామన్న విషయాన్ని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్న విషయాన్ని ఆయన తెలిపారు.

Leave a Reply