Urkonda | జాతీయ రహదారిపై నిరసనలు…

Urkonda | జాతీయ రహదారిపై నిరసనలు…
Urkonda | ఊర్కొండ, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఊరుకొండ మండల కేంద్రంలో ఈ రోజు జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు నల్ల జెండాలతో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ… కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం తెలంగాణ అస్తిత్వానికే అవమానమన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తోందని నేతలు ఆరోపించారు.
మోసపూరిత హామీలతో గదినెక్కిన కాంగ్రెస్ అడుగడుగునా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలే సరైన గుణపాఠం చెప్తారని అన్నారు. ఇకనైనా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పై కేసులపై దృష్టి పెట్టకుండా ప్రజలపై,రైతులపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఊర్కొండ బీఆర్ఎస్ పార్టీఅధ్యక్షుడు వీర రెడ్డి, నాయకులు శ్రీనివాసులు, జంగయ్య, కృష్ణాగౌడ్,వెంకటెష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
