parakala | ఆడబిడ్డగా వస్తున్న ఆశీర్వదించండి..

parakala | ఆడబిడ్డగా వస్తున్న ఆశీర్వదించండి..
- బీఆర్‌ఎస్ 17వ వార్డు అభ్యర్థి శనిగరం రజిని నవీన్
parakala | పరకాల, ఆంధ్రప్రభ : “ఆడబిడ్డగా వస్తున్న నన్ను ఆశీర్వదించాలి” అని బీఆర్‌ఎస్ 17వ వార్డు అభ్యర్థి శనిగరం రజిని నవీన్ ఓటర్లను అభ్యర్థించారు. ఆదివారం రోజు పరకాల మున్సిపాలిటీ 17వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి శనిగరం రజిని నవీన్ ఓటర్లను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డి ఆశీస్సులతో 17వ వార్డులో విజయం సాధించడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అభ్యర్థి శనిగరం రజిని నవీన్ మాట్లాడుతూ తాను నిత్యం 17వ వార్డు ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటు, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. తనపై నమ్మకం ఉంచి ఓటర్లు ఆశీర్వదిస్తే, వార్డులోని ప్రతి సమస్యను పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తానని శనిగరం రజిని నవీన్ హామీ ఇచ్చారు. అభ్యర్థి వెంట శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చందుపట్ల నరసింహారెడ్డి, బిఆర్ఎస్ 17వ వార్డ్ నాయకులు చట్ల వెంకటేశ్వర్లు, తోట రవీందర్, మహమ్మద్ అల్తాఫ్, తదితరులు ఉన్నారు.
