Nagoba Fair | అంబులెన్స్ సేవలపై సమీక్ష..

Nagoba Fair | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉమ్మడి ప్రోగ్రామ్ మేనేజర్ సామ్రాట్ నాగోబా జాతరలో ఏర్పాటు చేసిన 108 అంబులెన్స్ ల పై సమీక్ష నిర్వహించారు. ఆదివారం జాతరకు విచ్చేసిన భక్తులందరికీ అత్యవసర సమయంలో అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం అంబులెన్స్ లో ఉండే వైద్య పరికరాలని, మందులని చెక్ చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా మేనేజర్ లింగాచారి మరియు 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Nagoba Fair

Leave a Reply