Jayanti celebrations | సరస్వతీ మాత జయంతి వేడుకలు

Jayanti celebrations | సరస్వతీ మాత జయంతి వేడుకలు
- చిన్నారులకు అక్షరాభ్యాసం
Jayanti celebrations | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని ట్రినిటీ విద్యాసంస్థలలో ఈ రోజు చదువుల తల్లి సరస్వతి అమ్మవారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వసంత పంచమి ని పురస్కరించుకొని 286 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. చిన్నారులకు పలక, బలపం పంపిణీ చేశారు. ముందుగా అర్చకులు కిషోర్ శర్మ ఆధ్వర్యంలో గణాలకు అధిపతి అయినా గణపతి పూజ, మనల్ని రక్షిస్తున్న నవగ్రహాల పూజ, చదువుల తల్లి సరస్వతీ పూజలను తెల్లని పుష్పాలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమాలలో మాజీ మున్సిపల్ ఛైర్మెన్ వెన్ రెడ్డి రాజు, గాంధీ గ్లోబల్ ట్రస్ట్ మండల అధ్యక్షురాలు వెన్ రెడ్డి సంధ్య, విద్యాసంస్థల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జీని మంజుల, విద్యాసంస్థల చైర్మన్ కే వి బి కృష్ణారావు, సమన్వయకర్తలు మాలిక్, శివరాణి, శ్రీవాణి మంజుల, స్వప్న, నీరజ, జ్యోతి, ప్రీతి, లక్ష్మీ ప్రియ, లవ కుమారి, చందన, సుమలత, స్వరూప భార్గవి, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
