Pre-arrest | బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
Pre-arrest | జైనూర్/ సిర్పూర్ (యు) ఆంధ్రప్రభ : కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క పర్యటనతో పోలీసులు జైనూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ గ్రంథాలయ చైర్మన్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. అరెస్టు చేసి సిర్పూర్ (యు )పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అరెస్ట్ అయిన వారిలో జైనూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇంతియాజులాల, మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్ రావ్, మాజీ సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు మాడవి భీమ్రావు, మాజీ మార్కెట్ డైరెక్టర్ గేడం లక్ష్మణ్, ముండే సతీష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్, పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ… డిప్యూటీ సీఎం సన్ పర్యటన సందర్భంగా తమను ముందస్తుగా అరెస్టు చేయడం అప్రజాస్వామీకమని విమర్శించారు.
