Indravelli | నాగోబా ఆలయంలో పూజలు
Indravelli | నాగోబా ఆలయంలో పూజలు
- దేవాలయాన్ని దర్శించుకున్న డిప్యూటీ సీఎం, మంత్రి లక్ష్మణ్
Indravelli | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబా సన్నిధిలో బుధవారం రాత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. నాగోబా జాతర ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని సందర్శించగా మెస్రం వంశ పెద్దలు, ఆలయ పూజారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.
ఆచారంలో భాగంగా డిప్యూటీ సీఎం తోపాటు మంత్రి లక్ష్మణ్, ఎమ్మెల్యే వేడమ బొజ్జుకు తలపాగా చుట్టి పూజలు గావించారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. అటవీ సాగు భూములకు హక్కు పత్రాలు ఇచ్చే బాధ్యత తమదేనని డిప్యూటీ సీఎం తెలిపారు.
అనంతరం నాగోబా ఆలయ ప్రాశస్త్యం, జాతర ఉత్సవాల గురించి భట్టి విక్రమార్క అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజార్షి షా , ఎస్పీ అఖిల్ మహాజన్ , ఎమ్మెల్సీ దండేవిటల్, డిసిసి అధ్యక్షులు నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపూరావు తదితరులు పాల్గొన్నారు.
