Ghantasala | ప్రార్థనలు నిర్వహించడంపై అభ్యంతర వ్యక్తం చేస్తూ వినతి

Ghantasala | ప్రార్థనలు నిర్వహించడంపై అభ్యంతర వ్యక్తం చేస్తూ వినతి

Ghantasala | ఘంటసాల, ఆంధ్రప్రభ : ప్రార్థన లు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామస్తులు తాసిల్దార్ కార్యాలయం జరిగిన మీకోసంలో వినతిపత్రం అందజేశారు. చిట్టూర్పు గ్రామంలో నివాస గృహాల మధ్యన ఉన్న ఖాళీ ఇంటిని చల్లపల్లికి చెందిన పాస్టర్ చర్చి నిర్వహించుకునేందుకు కొనుగోలు చేశారన్నారు. నివాస ప్రాంతాల మధ్య చర్చి ఏర్పాటు చేయడం తమకు అభ్యంతరకరమన్నారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారిలో 65 సంవత్సరాలు పైబడి, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నారన్నారు. దగ్గర్లోనే ఒక చర్చి ఉన్నపటికీ మరో చర్చి అవసరమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. చర్చి నిర్వహణ తమకభ్యంతరకరమని తగు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్తులు కృష్ణమూర్తి, రమేష్, భవాని, ఫణి కిరణ్ లు రీ సర్వే డిటి శ్రీనివాసు కు వినతి పత్రం అందించారు.

Leave a Reply