Sports | జిల్లా స్థాయి టెన్నీన్ బాల్ క్రికెట్ టోర్నమెంట్

Sports | జిల్లా స్థాయి టెన్నీన్ బాల్ క్రికెట్ టోర్నమెంట్

  • విజేతలు అయిన క్రికెట్ టీంకు బహుమతి అందచేస్తున్న నాయకులు, అధికారులు
  • రసవత్తరంగా సాగిన టెన్నీన్ జిల్లా స్థాయి టెన్నిన్బాల్ క్రికెట్ టోర్నమెంట్
  • మొదటి బహుమతి కొండపి ఎన్.ఆర్.కే టీం
  • క్రీడా స్ఫూర్తి నింపేందుకు ఆటలు

Sports | టంగుటూరు, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరిలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు ఆటలపోటీలకు అని ఒంగోలు పార్లమెంట్ ఉపాద్యక్షులు గొర్రెపాటి రామయ్యచౌదరి తెలిపారు. అదివారం రాత్రితో కొండపిలో నిర్వహించిన జిల్లా స్థాయి టెన్నీన్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ రసవత్తరంగా ముగిసింది. ఈ టోర్నమెంట్ను కొండపి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత స్వర్గీయ దామచర్ల అంజనేయులు, కొండపి మండల రెవిన్యూ కార్యాయలం మరియు హై స్కూల్ స్థలదాత న్వర్గీయ బూదవాటి సోమయ్య నాయుడు జ్ఞాపకార్థంతో ఎన్ఐఆర్ 30వ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 29వ తేది నుంచి జనవరి 18వ తేది వరకు ఏర్పాటు చేయడం జరిగిందని కమిటి నిర్వహకులు తెలిపారు.

మొదటి నుంచి చివరి వరకు జిల్లా స్థాయి నుంచి 58 టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగిందని కమిటి వారు తెలిపారు. చివరకు ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ కొండపి ఎన్.ఆర్.కే టీంకు, చీమకుర్తి టీంకు మధ్య జరగగా అందులో ఎన్.అర్.కె టీం మొదటి స్థానం కైవనం చేసుకొని రూ.60వేలు నగదును, షీల్డును అతిథులు చేతుల మీదుగా అందచేయడం జరిగింది. రెండవ బహుమతి చీమకుర్తి టీంకు రూ.30వేల నగదును ముప్పవరం గ్రామానికి చెందిన గంగాధర్ అందించడం జరిగింది. మూడవ బహుమతి కొండపి ఇండా చెట్టు టీంకు రూ.20వేలు నగదును శ్రీకాంత్, బలగం సాయి లు అతిథులకు చేతుల మీదుగా, నాలుగవ బహుమతి పొన్నలూరు మండలం పెదవెంకన్నపాలెం టీంకు రూ.10వేలు నగదును ఎదురు బాలకృష్ణ అందచేయడం జరిగింది.

అదే విదంగా మ్యాన్ అప్డే సిరీసు కొండపి గ్రామానికి చెందిన నల్మాన్కు రూ.5116, మ్యాన్ అని మ్యాచ్ను వినయ్కు రూ.3116 ను అందించడం జరిగింది. మొదటి బహుమతి సాదించిన టీంలో జిల్లా స్థాయిలో టాప్ 10లో సెలెక్టు అయిన ఎన్ఆర్కి టీంలో అడడం గొప్ప విషయం అని కమిటి సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా జి. రామయ్యచౌదరి మాట్లాడుతూ జిల్లా స్థాయి క్రికెట్ను ఏర్పాటు చేయడం వలన ఎంతో మంది క్రీడాకారులు చూడడం, వారి నైపుణ్యాలను కూడా చూడడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండపి సర్కిల్ సిఐ సోమశేఖర్, కొండపి తేదేపా మండల అధ్యక్షులు వనంతరావు, కొండవీ ఎన్ఐ ప్రేమకుమార్, నాయకులు బత్తుల నారాయణస్వామి, నర్పంచ్ కొమ్ము నుశీల, బూడవాటి సోమయ్య, ముక్కు ప్రసాదు, జాను, బ్రహ్మయ్య, వీరమోను మస్తాన్, అరికట్ల వెంకటరావు, ఎన్అర్కి యూత్ పోర్సు కమిటి సభ్యులు తదితరులు పాల్గన్నారు.

Leave a Reply