మృతుల కుటుంబాలను ఆదుకోవాలి – అన్నా రాంబాబు..

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి – అన్నా రాంబాబు..

మార్కాపురం, ఆంధ్రప్రభ : ఈ రోజు ఉదయం మార్కాపురం మెడికల్ కాలేజీ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు – టిప్పర్ ఢీ కొన్న ప్రమాదంలో కొంత మంది సజీవ దహనం కావడం పట్ల గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ YSRCP ఇంచార్జి అన్నా రాంబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సమాచారం తెలియగానే హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. మృతుల గురించి ఆయన వాకబు చేసి, వారి బంధువులకు సమాచారం అందించడం పై ఆరా తీశారు. ప్రమాద ఘటన పై విచారణ పూర్తి స్థాయిలో జరిపించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply