Women | అయ్యో ఏం క‌ష్ట‌మొచ్చిందో..!

Women | అయ్యో ఏం క‌ష్ట‌మొచ్చిందో..!

  • ఇద్దరు పిల్లలకు విషమిచ్చి,తల్లి ఉరివేసుకొని మృతి
  • నంద్యాలలో దారుణం…

Women | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రమైన నంద్యాల పట్టణంలో శనివారం ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో ఉన్న లలితా నగర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. నంద్యాల టూ టౌన్ పోలీసులు తెలుపుతున్న వివరాల మేరకు కాలనీలో నివాసం ఉంటున్న మల్లికా సుధా (26) సంవత్సరాలు ఇషాన్ సాయి( రెండు సంవత్సరాలు), పరిమిత ఏడు నెలల చిన్నారి పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కొన ఊపిరితో ఉన్న మల్లికను ఆసుపత్రికి తీసుకురాగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

Women

భర్త, ఆడపడుచులే వీరిని చంపారంటు మృతురాలి బంధువులు ఆరోపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే కారణమా అనే రీతిలో పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. భర్త ఆడపడుచులు ఇంటి దగ్గర లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తుందని పోలీసులు పేర్కొంటున్నారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Women