Spain | ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి

Spain | ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
Spain | స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి మరో రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందారు. మరో 73 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, గాయపడిన 73 మంది ప్రయాణికులను ఆరు వేర్వేరు ఆసుపత్రులకు తరలించామని ప్రాంతీయ ఆరోగ్య మంత్రి ఆంటోనియో సాన్జ్ తెలిపారు. హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి, ఎదురుగా వస్తున్న రైలును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
