Telangana | 13మందికి గాయాలు
Telangana | 13మందికి గాయాలు
Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో తూప్రాన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తూప్రాన్ జాతీయ రహదారిపై ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 13మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారు మాసాయిపేట మండలానికి చెందిన కూలీలు గా గుర్తించారు. గాయపడ్డ వారిలో అధిక సంఖ్యలో మహిళలున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

