Road Accident | ఆర్టీసీ బస్సు ప్రమాదానికి కారణం ఇదే..

Road Accident | హనుమాన్ జంక్షన్, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, బాపులపాడు మండలం అరుగొలను కానుమోలు గ్రామాల మధ్యన ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో మచిలీపట్నం తిరువూరు ప్రధాన జాతీయ రహదారి పై బస్సు ప్రమాదం జరిగింది. ఉదయం 7 గంటల సమయంలో ఉయ్యురు డిపో పల్లెవెలుగు బస్సు, లారీ ఢీ కొనడంతో భారీ ప్రమాదం జరిగింది.
కొందరు వాహనదారులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదానికి కారణం అధికంగా కురుస్తున్న పొగ మంచు, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వలనే ప్రమాదం జరిగిందని తెలియచేస్తున్నారు. ఓ పక్కన అధిక పొగ మంచు పడుతున్న కనీసం నెమ్మదిగా వెళదాం అనే ఆలోచన లేకుండా బస్సు డ్రైవర్ ఇతర వాహనాలను క్రాస్ చేయడం కోసం స్పీడుగా వెళ్లడం ఈ ప్రమాదానికి కారణమని అక్కడున్న వాళ్లు తెలియచేశారు.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలై కాలు విరిగింది. బస్సులోని కొందరు ప్రయాణికులు స్వల్ప గాయలతో ప్రమాదం నుంచి బయట పడ్డారు. హనుమాన్ జంక్షన్ పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని వాహనదారులకు ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్ ని సరి చేసి ప్రమాదంలో గాయపడ్డ వారిని గుడివాడ ప్రభుత్వ అసువత్రికి తరలించారు.
