Kurnool | గూడ్స్ రైలు తగిలి వ్యక్తి దుర్మరణం

Kurnool | గూడ్స్ రైలు తగిలి వ్యక్తి దుర్మరణం

Kurnool | తుగ్గలి, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన తుగ్గలి కి చెందిన మారెళ్ళ కురువ మంకీ సునీల్ కుమార్(36) శనివారం రైలు గూడ్స్ తగిలి దుర్మరణం చెందారు. మారెళ్ళ కురువ మంకీ సునీల్ కుమార్ తుగ్గలి సమీపంలోనే ఆవులదొడ్డి మోరి వద్ద రైల్వే ట్రాక్ పై వెళుతుండగా వెనకనుంచి గూడ్స్ వచ్చి తగలడంతో దుర్మరణం చెందారు. మరణించిన సునీల్ కుమార్ కు భార్య సోమేశ్వరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయంపై రైల్వే గూడ్స్ పైలెట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డోన్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply