Thuggali | రసవత్తంగా సాగిన రాతి దూలం లాగుడు పోటీలు

Thuggali | రసవత్తంగా సాగిన రాతి దూలం లాగుడు పోటీలు
Thuggali | తుగ్గలి, ఆంధ్రప్రభ : మండలం పరిధిలోనే ఉప్పర్లపల్లె గ్రామంలో మౌలాలి స్వామి ఉరుసు సందర్భంగా శనివారం రసవత్తంగా రాతి దూలం లాగుడు పోటీలు జరిగాయి. ఈ పోటీలను జిల్లా గ్రంథాలయ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు అప్పా వేణుగోపాల్, మాజీ సర్పంచ్ లు బిసి వెంకటస్వామి, శ్రీనివాస్ గౌడు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మౌలాలి స్వామి ఉరుసుకు వచ్చిన భక్తులకు, బంధువులకు వినోదం కలిగించేందుకు రాతిదూలం పోటీలను గ్రామస్తులు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ పోటీలో విజేతలైన వృషభయజమానులకు మెదటి బహుమతి రూ 50 వేలు రాముల బ్రదర్స్, రెండవ బహుమతి రూ. 40 వేలు షేక్ మౌలాలి బ్రదర్స్,మూడవ బహుమతి రూ. 20 వేలు ఆర్. లక్ష్మి నాయక్ బాట తాండ, నాల్గువ బహుమతి రూ 10 వేలు, ఎలగాని దేవేంద్ర, ఐదవ బహుమతి రూ 5 వేలు, పుల్లా లక్ష్మిదేవమ్మ లు బహుమతులు అందజేశారు. అలాగే యాంకర్ కు రూ. 10 వేలు కె. ఆదినారాయణ, కె. మల్లిఖార్జున లు అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్గా ధర్మకర్తలు సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు భాస్కర్, ఉపసర్పంచ్ రామాంజనేయులు, పోస్ట్మాస్టర్ అప్పా వేణుగోపాల్, ఫీల్డ్ అసిస్టెంట్ విశ్వనాథ్, వైసిపి నాయకులు సత్యనారాయణ, టిడిపి నాయకులు నీలా ప్రసాదు, నీలా మనోహర్, ఈశ్వరయ్య,అప్పా జగన్మోహన్ వీఆర్ఏలు రమేష్, వేణు తదితరులు పాల్గొన్నారు.
