Megastar | అనిల్ రావిపూడికి బంపర్ ఆఫర్

Megastar | అనిల్ రావిపూడికి బంపర్ ఆఫర్

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హిట్ మిషన్ అనిల్ రావిపూడి వరుసగా సక్సెస్ సాధిస్తూ కెరీర్ లో దూసుకెళుతున్నాడు. మన శంకర్ వరప్రసాద్ గారు అంటూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించాడు. ఈ సినిమా ప్రతి రోజు బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. దీంతో ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే.. చిరు.. అనిల్ రావిపూడికి మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇంతకీ.. ఏంటా బంపర్ ఆఫర్…?

Megastar

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర పోటీ గట్టిగానే ఉన్నప్పటికీ.. మన శంకర్ వరప్రసాద్ గారు కలెక్షన్స్ వేటలో దూసుకెళుతుంది. అయితే.. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరు, వెంకీ, అనిల్ రావిపూడి కలసి స్పెషల్ ఇంటర్ వ్యూ చేశారు. ఈ ఇంటర్ వ్యూలో ఎన్నో సరదా కబుర్లు చెప్పుకున్నారు. ఈ ఇంటర్ వ్యూ చివరిలో మెగాస్టార్ మాట్లాడుతూ.. వెంకటేష్ సినిమాలో అనిల్ రావిపూడి కనుక తనకు ఏదైనా క్యామియో రోల్ ఆఫర్ చేసినా చేస్తాను. లేదా ఫుల్ లెంగ్త్ రోల్స్ తో ఇద్దరినీ బ్యాలన్స్ చేసేలా బెస్ట్ స్క్రిప్ట్ తో వచ్చినా చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పారు. దీనికి వెంకీ కూడా ఇద్దరం కలిసి సినిమా చేయడానికి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

Megastar

అయితే.. అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది సస్పెన్స్ గా మారింది. సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ చేయాలి.. నాగార్జునతో అనిల్ రావిపూడి సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. దీనికి అనిల్ రావిపూడి రెడీ.. నాగార్జున కూడా రెడీనే. మరో వైపు రవితేజతో అనిల్ రావిపూడి సినిమా అని కూడా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. చిరు, బాబీతో ఓ సినిమా, శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారు. వెంకీ, ఆదర్శ కుటుంబం, దృశ్యం 3 సినిమాలు చేయాలి. సో.. చిరు, వెంకీ ఓకే చేసిన సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత అంటే.. కాస్త టైమ్ పట్టచ్చు. మరి.. అనిల్ నెక్ట్స్ ఎవరితో ఉంటుందో క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Megastar

CLICK HERE TO READ జైలర్ 2లో కోలీవుడ్ స్టార్

CLICK HERE TO READ MORE

Leave a Reply