TG | సీఎంని కలిసిన ఎస్.ఏ. సంపత్ కుమార్..
TG | సీఎంని కలిసిన ఎస్.ఏ. సంపత్ కుమార్..
TG, ఇటిక్యాల, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ .ఏ సంపత్ కుమార్. మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ( బ్రహ్మోత్సవాలకు) జాతరకి రావాల్సిందిగా మహబూబ్ నగర్ శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో సంపత్ కుమార్ ప్రస్తుత రాజకీయాల పై బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, హరీష్ రావ్ చేస్తున్న అసత్య ప్రచారాల పై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలియజేశారు.
