విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు క్విజ్ పోటీలు

విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు క్విజ్ పోటీలు

  • తహసిల్దార్ జ్యోతి

మోత్కూర్, ఆంధ్రప్రభ ; విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికి తీసేందుకు క్విజ్ పోటీలు ఎంతగానో దోహదపడతాయని తహసిల్దార్ జ్యోతి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు.

తహశీల్దార్ జ్యోతి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. సమాజం లోని అన్ని అంశాలపై విద్యార్థి దశ నుండే అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో కస్తూర్భా విద్యాలయం ఎస్ ఓ యాదమ్మ,ఉపాధ్యాయినిలు రేఖ, మహేశ్వరి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply