AP | వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం..

AP | వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం..
AP | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో సంక్రాంతి పండుగ సంబరాలు గురువారం అంబరాన్నంటాయి. సంక్రాంతి పండుగ రోజు ధనుర్మాస ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని, సంజీవనగర్ గేటు వద్ద కోదండ రామస్వామి దేవాలయం వద్ద వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి 18 అడుగుల దివ్య రథోత్సవం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కనులవిందుగా జరిగిన ఈ రథోత్సవ కార్యక్రమంలో టీడీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని, నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య ఆయన స్వామివారి రథాన్ని లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ రథోత్సవం నంద్యాల పట్టణ వీధుల్లో ఆధ్యాత్మిక శోభను నింపింది. వేలాది మందిగా భక్తులు తరలివచ్చారు. రథాన్ని ఊరేగింపుగా పురవీధులుగా తిప్పారు. మేలతాళాల మధ్య ప్రజలు ఈ రథోత్సవాన్ని కనుల పండుగ తిలకించారు. భగవత్ సేవ సమాజ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవర్శెట్టి శ్రీనివాస్, నేరెళ్ల అశోక్ కుమార్, ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పరి సురేష్ కుమార్, సాయిరాం రాయల్, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక టీడీపీ నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
