Temple | సంక్రాంతి పండుగ వేళ..

Temple | సంక్రాంతి పండుగ వేళ..
Temple | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో సంక్రాంతి పండుగ వేళ భక్తులు కిటకిటలాడారు. తెల్లవారుజాము నుంచి భక్తులు వేల సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్ లో నిలబడ్డారు. భక్తుల కోసం దేవస్థానం అధికారులు ప్రత్యేక వసతి సౌకర్యాలను కల్పించారు.
కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో క్యూలైన్లో ఉన్న భక్తులకు చిన్నారులకు పళ్ళు పాలును సరఫరా చేశారు. పలహారాన్ని కూడా అందించారు. శివసేవకులు వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశారు. పండుగ రోజు కావటం.. సంక్రాంతి సెలవులు కావడంతో.. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అధికంగా వచ్చారు. సంక్రాంతి మహోత్సవాల సందర్భంగా కూడా శ్రీశైలంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
