Gifts | పండగల విశిష్టతను భావితరాలకు వివరించాలి

Gifts | పండగల విశిష్టతను భావితరాలకు వివరించాలి
Gifts | ఊట్కూర్, ఆంధ్రప్రభ : భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు పండగల విశిష్టతలను భావితరాలకు ప్రతి ఒక్కరు వివరించాలని ఊట్కూర్ ఉపసర్పంచ్ రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్, 14వ వార్డు సభ్యురాలు సువర్ణ రవికుమార్ అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీ అంబ భవాని మాత దేవాలయంలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సంక్రాంతి పండగ మూడు రోజులపాటు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారని వాకిళ్ళముందురంగులముగ్గులు వేసి సాంస్కృతి బింబించే విధంగా ముగ్గులు అలంకరిస్తారనిఅన్నారు. గత కొన్నేళ్ల నుండి ఎస్ ఎస్ కె సమాజ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని రంగవల్లుల పోటీలు, నువ్వులు చక్కర పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు.
పండగలు మన పూర్వీకులు కాలానికి అనుగుణంగా చేపట్టేవారని మనం భవిష్యత్తులో పండుగలు ఘనంగా జరుపుకునే విధంగా కృషి చేద్దామన్నారు. ముగ్గుల పోటీలలో ప్రథమ బహుమతి స్నేహ, ద్వితీయ బహుమతి అశ్విని, తృతీయ బహుమతి గాయత్రి స్వాతి కైవసం చేసుకోవడంతో 14వ వార్డు సభ్యురాలు సువర్ణ సొంత ఖర్చులతో బహుమతులు అందజేసినట్లు తెలిపారు. అనంతరం నూతనంగా గెలుపొందిన నాయకులను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ కే సమాజ్ అధ్యక్షుడు చౌదరి అశోక్ రావు, మహిళా అధ్యక్షురాలు రాధా చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
