వింత వ్యాధితో 8 ఆవుల మృత్యువాత

వెల్దండ (ఆంధ్రప్రభ) : వెల్దండ మండలంలోని రాచూర్ తండాకు చెందిన రైతు పాత్లావత్ పర్ష అనే రైతుకు చెందిన 8 పాడి ఆవులు వింత వ్యాధి కారణంగా బుధవారం మృతి చెందాయి.

రైతు తెలిపిన వివరాల ప్రకారం, ఆయన లక్షలాది రూపాయలు ఖర్చు చేసి డెయిరీ ఫార్మ్‌ను ఏర్పాటు చేసి 16 ఆవులను పోషిస్తున్నారని తెలిపారు. అయితే గత 15 రోజులుగా ఆవులకు ఒక వింత వ్యాధి సోకడంతో పశువైద్యాధికారిని సంప్రదించగా, చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని, చివరికి 8 ఆవులు వరుసగా మృతి చెందాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆవులను కోల్పోయిన లబోదిబోమని విలపిస్తూ ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతు కోరారు.