ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్
ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్
పామర్రు – ఆంధ్రప్రభ : పామర్రు పోలీస్ స్టేషన్ పరిధిలో జూదం ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 52 కార్డులతో పేకాట ఆడుతున్న7 మంది వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడిని సబ్ ఇన్‌స్పెక్టర్ విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుళ్లు సతీష్ మరియు శ్రీను కలిసి నిర్వహించారు.
సంఘటనా స్థలంలో పేకాట ఆడుతూ ఉండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.4,870 నగదు మరియు 52 కార్డుల ఒక ప్యాక్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 7 మంది వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ కేసు నమోదు చేశారు. పామర్రు పోలీసులు ప్రజలకు జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ, ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
