దోమల నివారణ, ఎండ తీవ్రత పై గ్రామస్తులకు అవగాహన

దోమల నివారణ, ఎండ తీవ్రత పై గ్రామస్తులకు అవగాహన

గ్రామాల పరిశుభ్రత, ఎండ తీవ్రతపై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్న సర్పంచ్ అధికారులు…
అంత అవసర పరిస్థితి ఉంటేనే ఇంటి నుండి బయటికి రావాలి సర్పంచ్ సమీర్.
.

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలోని బాబాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక సర్పంచ్ ఎంఏ.సమీర్, ఉపసర్పంచ్ మంద గోవర్ధన్, వైద్య అధికారులు, గ్రామానికి చెందిన వివిధ శాఖల అధికారులను తీసుకొని ఇంటింటికి తిరుగుతూ దోమల నివారణ పై జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ ఇండ్లలో నిల్వ ఉంచిన కూలర్ల నీళ్లను తొలగిస్తూ బ్లీచింగ్ పౌడర్ చెల్లిస్తూ అవగాహన కల్పించారు.

అలాగే ఎన్నడూ లేని విధంగా భానుడి పతాపం చూపడంతో ఎండ తీవ్రత పెరగడంతో 46 డిగ్రీలు దాటడంతో ప్రజలకు జాగ్రత్త పాటిస్తూ అంత అవసరం పరిస్థితి ఉంటేనే బయటకు రావాలని లేని పక్షాన ఇంటి నుండి బయట వెళ్లకుండా జాగ్రత్త పాటించాలని గ్రామ ప్రజలకు అధికారులు నాయకులు, ఇంటింటికి తిరుగుతూ ఓఆర్ఎస్ పాకెట్లను పంచుతూ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎన్. ప్రశాంత్, కారోబార్ ఇమ్రాన్, సూపర్వైజర్ వలియోద్దీన్, సౌమ్య శశికళ ఆశ వర్కర్లు లతా, శారద, అనసూయ, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply