31yrs women | ఆసుపత్రిలో అరుదైన ప్రసవం
31yrs women | ఆసుపత్రిలో అరుదైన ప్రసవం
31yrs women | ఉత్తరప్రదేశ్‌లో అరుదైన వైద్య ఘటన
ఐదు రోజుల వ్యవధిలో నాలుగు ప్రసవాలు
సాధారణ ప్రసవంతో వైద్యులను ఆశ్చర్యపరిచిన మహిళ
వైద్యుల పర్యవేక్షణలో నవజాత శిశువులుa
31yrs women | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లాకు చెందిన 31 ఏళ్ల మహిళ ఐదు రోజుల వ్యవధిలో నలుగురు పిల్లలకు జన్మనిచ్చి వైద్య రంగంలో అరుదైన ఘట్టాన్ని సృష్టించారు. మొరాదాబాద్‌లోని తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ ఆసుపత్రిలో జరిగిన ఈ ప్రసవాలను వైద్యులు అత్యంత సవాలుతో తీసుకున్నారు. సాధారణంగా శస్త్రచికిత్స (సిజేరియన్) అవసరమయ్యే ఇలాంటి గర్భధారణలో, ఇక్కడ మాత్రం నలుగురు శిశువులు సాధారణ ప్రసవంతో జన్మించటం వైద్యరంగంలో అరుదైన ఘట్టం అభివర్ణించారు.
వైద్యుల వివరాల ప్రకారం.. అమీనా అనే మహిళ గర్బం దాల్చడంతో ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకుంది. అయితే అల్ట్రాసౌండ్ స్కాన్‌లో ఆమె గర్భంలో నాలుగు పిండాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ గర్భాన్నిముందు నుంచే అత్యంత సంక్లిష్టమైందిగా వైద్యులు భావించారు. పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, వైద్య బృందం ఫెటల్ రిడక్షన్ సలహా ఇచ్చినా, కుటుంబం నాలుగు గర్భాలను కొనసాగించాలని నిర్ణయించింది.

గర్భధారణ సమయంలో అమీనాకు రక్తపోటు, కాలేయ సమస్యలతో కూడిన సమస్యలు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆమెను తరచుగా ఆసుపత్రిలో చేర్చుతూ.. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉండేది. మే 8న ఆమెకు నొప్పులు రాగా మే 9న కుమారుడికి జన్మనిచ్చిది. అయితే ఆ బాబు బరువు సుమారు 710 గ్రాములు ఉన్నాడు. అమీనా పరిస్థితి దృష్ట్యా గర్భం ఆరున్నర నుండి ఏడు నెలల దశలో ఉండటంతో మిగిలిన ప్రసవాలను వైద్యులు వాయిదా వేశారు.
ఐదు రోజుల తరువాత, మే 14న, మళ్లీ పురిటి నొప్పులు రావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆమెకు ఈ సారి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చింది. నవజాత శిశువుల్లో ఒకరు పూర్తిగా ఆరోగ్యంగా ఉండగా, మిగిలిన ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
వైద్యులు పేర్కొన్న విధంగా, నలుగురు శిశువులు వేర్వేరు సంచులలో ఉండటం, సాధారణ ప్రసవం ద్వారా జన్మించడం అత్యంత అరుదని, సకాలంలో వైద్యం, నిరంతర పర్యవేక్షణ, కుటుంబ సభ్యుల సహకారంతో ప్రసవాలు విజయవంతంగా జరిగాయని తెలిపారు.
