నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు

నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు

-మండల వ్యవసాయ అధికారి అహ్మద్

అమరావతి, ఆంధ్రప్రభ: అమరావతి మండల పరిధిలోని రైతు సోదరులు నకిలీ విత్తనాలుకొనిమోసపోవద్దని, లైసెన్స్ డీలర్ వద్దే విత్తనాలుకొనాలని మండల వ్యవసాయ అధికారి షేక్ అహ్మద్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రమైన అమరావతిలో పలు విత్తనాల షాపులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను, విత్తన ప్యాకెట్లను పరిశీలించారు.

పత్తి విత్తనాల కొనుగోలు లో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు,మెళకువలనువివరించారు.రైతులందరూ విత్తనాలు కొనుగోలుచేసేటప్పుడు తప్పని సరిగా లైసెన్స్ పొందిన అధికృత డీలర్ వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా రసీదు పొందాలని కోరారు. రశీదులోఉన్నటువంటి బ్యాబ్ నెంబరు, గడువు తేదీ, కంపెనీ పేరు, చిరునామా, మొలకశాతం, బరువు మొదలైనవి ప్యాకెట్టు పై చూసి తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితులలో గులాబీ రంగు పురుగు ఉదృతి ఎక్కువగా ఉన్నదని, కావున ఆ పురుగు ను తట్టుకొనే నాణ్యమైన బి టి ప్రత్తి విత్తనాలన మాత్రమేఎంపికచేసుకోవాలని సూచించారు.

అదేవిధంగా లైసెన్సే లేని ప్రవేట్ వ్యక్తులు వద్ద నుండి కాని, గ్రామాలలో విక్రయించే లూజు ప్యాకెట్స్ విత్తనాలు, రొడ్డు పక్కన విక్రయించే వారి వద్ద నుండిఎట్టి పరిస్థితుల్లోనూ విత్తనాలు కొనుగోలు చేయవద్దనిసూచించారు.అమరావతి మండలం లోని లెసెన్సే పొందిన డీలర్లు అందరూ కుడా రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించి, రసీదు తప్పనిసరిగా అందించాలని తెలియజేశారు.

గ్రామాలలో ఎటువంటి లూజు విత్తనాలు విక్రయించిన, గ్లైసిల్ బి టి విత్తనాలు విక్రయించిన, పంట పండించిన మండల వ్యవసాయ అధికారి వారి కార్యాలయలలో గాని, మీ గ్రామ సవివాలయంలో లోని వ్యవసాయ సహాయ అధికారిని సంప్రదించి తెలియజేయగలరని ఏవో అహ్మద్ కోరారు.

Leave a Reply