today ipl 2026 match| బెంగళూర్ వర్సెస్ లక్నో

today ipl 2026 match| బెంగళూర్ వర్సెస్ లక్నో
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా ఈ రోజు ఆసక్తికర పోరు జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – లక్నో సూపర్ జెయింట్స్ నేడు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. అయితే ముంబైతో మ్యాచ్‌లో కోహ్లీకి గాయమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అతను ఆడతారా? లేదా? అనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఐపీఎల్‌లో లక్నోపై ఆర్టీబీదే ఆధిక్యం. ఈ రెండు జట్ల మధ్య ఆరు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆర్సీబీ నాలుగు, లక్నో రెండు మ్యాచ్‌లు గెలిచింది.

డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు జట్టు ఈ సీజన్‌లోనూ మంచి ఊపు మీద ఉంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ మూడు మ్యాచులు గెలిచింది. పాయింట్ల పట్టికలో టాప్ 3లో నిలిచింది. ఇక లక్నో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు ఓడి, రెండు గెలిచింది. దాంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మొదటి మ్యాచ్‌లో ఓడిన లక్నో.. రెండు, మూడు మ్యాచ్‌లలో గెలిచింది. మళ్లీ గుజరాత్‌పై ఓటమిపాలయింది.

బెంగళూరు జట్టు అంచనా
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రశిక్ సలామ్, జాకబ్ డప్ఫీ/జోష్ హేజిల్‌వుడ్, సుయాశ్ శర్మ.
లక్నో జట్టు అంచనా
ఎయిడెన్ మార్కరమ్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్, ఆయుష్ బదోనీ, నికోలస్ పూరన్, అబ్దుల్ సమ్మద్, ముకుల్ చౌదరి, జార్జ్ లిండే / నోకియా, మొహమ్మద్ షమీ, అవేశ్ ఖాన్ / మొహ్సిన్ ఖాన్, దిగ్వేష్ సింగ్, ప్రిన్స్ యాదవ్ / మయాంక్ యాదవ్.
