2packages I రూ.9362 కోట్లతో ఆరు వరుసల ఎక్స్ ప్రెస్ వే
2packages I రూ.9362 కోట్లతో ఆరు వరుసల ఎక్స్ ప్రెస్ వే
2packages I ప్రాజెక్టును మొత్తం 161.518 కిలోమీటర్లు
నిర్మాణం కోసం టెండర్లకు ఆహ్వానం
జూలై లో తెరవనున్న బిడ్లు
2packages I హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.9,362 కోట్లతో 6 వరుసల ఎక్స్‌ప్రెస్‌వే రానుండటంతో ఆయా ప్రాంతాలు సిటీలుగా మారనున్నాయి. తెలంగాణ రవాణా రంగాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలను పూర్తిగా మార్చేసే భారీ ప్రాజెక్ట్ ‘రీజినల్ రింగ్ రోడ్డు కోసం ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
టెండర్ నోటిఫికేషన్‌ను రిలీజ్
ఈ ప్రాజెక్ట్ కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సరికొత్త టెండర్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. గతంలో ఉన్న ఐదు ప్యాకేజీల కన్ఫ్యూజన్‌ను పక్కన పెట్టి, ఈసారి కేవలం రెండు ప్యాకేజీలతో పనులను స్పీడప్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ ఒక్క నిర్ణయంతో తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లనుంది. ఈ ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్ట్ కేవలం ఒక రోడ్డు మాత్రమే కాదు, తెలంగాణ పాలిట ఒక కల్పవృక్షం కాబోతోంది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి మొదలై మెదక్, సిద్దిపేట జిల్లాల మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లా తంగడ్‌పల్లి వరకు ఈ రోడ్డు కనెక్ట్ అవుతుంది.
చిన్న పట్టణాలు గ్లోబల్ సిటీలుగా..
ఈ రూట్ పరిధిలోకి వచ్చే గజ్వేల్, ప్రజ్ఞాపూర్, భువనగిరి, సంగారెడ్డి వంటి ప్రాంతాలు రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరానికి ఏమాత్రం తీసిపోని విధంగా గ్లోబల్ సిటీలుగా మారబోతున్నాయి. ఇప్పటికే ఆయా రూట్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఐటీ కారిడార్లు, ఇండస్ట్రియల్ హబ్‌లు ఇక్కడికి క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును మొత్తం 161.518 కిలోమీటర్ల మేర ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తున్నారు. దీని సివిల్ పనుల అంచనా వ్యయం రూ.9,362.4 కోట్లు. ఈ రహదారికి కేంద్రం ‘NH-161AA’ అనే అధికారిక నంబరును కూడా కేటాయించింది.
రెండు ప్యాకెజీలుగా విభజన
ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్ట్ పనులను మరింత వేగవంతం చేసేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రెండు ప్రధాన ప్యాకేజీలుగా విభజించింది. ప్యాకేజీ-1 (సంగారెడ్డి – సిద్దిపేట): ఈ మొదటి ప్యాకేజీ కింద సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వరకు పనులు జరగనున్నాయి. ఈ రూట్ మొత్తం పొడవు 83.518 కిలోమీటర్లు కాగా, దీని నిర్మాణానికి రూ. 4,918.71 కోట్ల అంచనా వ్యయాన్ని కేటాయించారు. ప్యాకేజీ-2 (సిద్దిపేట – యాదాద్రి): ఇక రెండో ప్యాకేజీ కింద సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ నుండి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడ్‌పల్లి వరకు ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తారు. ఈ మార్గం పొడవు 78 కిలోమీటర్లు కాగా, దీని కోసం రూ. 4,443.69 కోట్ల అంచనా వ్యయాన్ని ఖరారు చేశారు. ఈ టెండర్లను డిజైన్, బిల్ట్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ యాన్యుటీ లేదా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌లో చేపట్టనున్నారు. జూలై 7 లోపు బిడ్లు దాఖలు చేయడానికి గడువు ఇచ్చారు. జూలై 8న టెక్నికల్ బిడ్స్ ఓపెన్ చేస్తారు.
