27 వార్డ్ గంగారంలో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్..

27 వార్డ్ గంగారంలో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్..

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 27వ వార్డు గంగారంలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడం ఖాయమని పార్టీ అభ్యర్థి హెచ్ రాకేష్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం గంగారంలోని పలు కాలనీలో మాజీ వైస్ చైర్మన్ హెచ్ సురేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శశాంక్ రెడ్డితో కలిసి ఆయన ఇంటిటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూతురు చైర్పర్సన్ గా బరిలో ఉన్నందున వికారాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 50 రోజుల్లో వికారాబాద్ ని తెలంగాణలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply